బాలకృష్ణ తన సినిమాలని వరుస పెట్టి చేస్తారు అనేది తెలిసిందే. అస్సలు గ్యాప్ రాకుండా సినిమాలు అనౌన్స్ చేస్తారు.ఇక సినిమాల విషయంలో హిట్లు, ఫ్లాఫ్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఇక ఇప్పుడు అఖండ సినిమా చేస్తున్నారు. అయితే తాజాగా మరోసారి పూరీ జగన్నాథ్ తో ఆయన సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో పైసా వసూల్ సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక బాలయ్య బాబు మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటితో అఖండ తరువాత గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నారు బాలయ్య.
ఈ సినిమా పూర్తి అయిన తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేస్తారు. ఆ తర్వాత దర్శకుడు పూరి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు. మొత్తానికి ఈసారి వీరి కాంబోలో ఎలాంటి చిత్రం వస్తుందో అని అభిమానులు చూస్తున్నారు.