బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ(Mokshagna) లాంచ్ కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కాగా మోక్షజ్ఞ లాంచ్ కోసం బాలయ్య బాబు.. కథలు వింటున్నాడని, డైరెక్టర్‌ని వెతుకుతున్నాడని కొంతకాలంగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మోక్షజ్ఞను లాంచ్ చేసే డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడు. కథ, స్క్రీప్లే అంతా సెట్ అయిందట.
అతిత్వరలోనే మోక్షజ్ఞ(Mokshagna) తొలి సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేసేది మరెవరో కాదు.. నందమూరి బాలకృష్ణే అని టాక్ నడుస్తోంది. తన కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచిన ‘ఆదిత్య 369’ సినిమా సీక్వెల్‌నే ఇప్పుడు బాలయ్య.. తన కుమారుడు మోక్షజ్ఞ లాంచ్‌కు సిద్ధం చేస్తున్నాడట.
ఆదిత్య 369(Aditya 369) సినిమాకు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. 1991లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అందరి మన్ననలు అందుకుంది. అప్పటి నుంచి కూడా ఈ సినిమా రెండో పార్ట్ ఉంటే బాగుండని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అదే విధంగా ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రయత్నాలు కూడా గట్టిగానే జరుగుతున్నాయి.
కాగా తాజాగా తన కుమారుడి లాంచ్ కోసం ఈ సినిమా సీక్వెల్‌ను ‘ఆదిత్య 999 మ్యాక్స్’ తెరకెక్కించాలని బాలయ్య నిశ్చయించుకున్నాడట. అన్‌స్టాపబుల్ షో సీజన్-4 ఎపిసోడ్-6లో ఈ విషయాన్ని బాలకృష్ణ(Balakrishna) అధికారికంగా ప్రకటించనున్నాడని సమాచారం. ఇప్పటికే ‘ఆదిత్య 999 మ్యాక్స్’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. ఈ షో ఆ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో బాలకృష్ణ మరోసారి ‘ఆదిత్య 369’ గెటప్ కనిపించనున్నారు.