బాలయ్య బాబు – అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఇదేనా?

Balakrishna Anil Ravipudi new Movie title Updates

0
108

బాలయ్య బాబుతో సినిమా చేయాలని చాలా మంది దర్శకులకి కల. ఇటీవల యంగ్ డైరెక్టర్ల దగ్గర కథలు కూడా వింటున్నారు బాలయ్య. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎప్పటినుంచో బాలయ్యతో సినిమా కోసం ట్రై చేస్తున్నాడు. ఇటీవలే అనిల్ తో సినిమా చేయడానికి బాలకృష్ణ సిద్దంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఎఫ్ 3 సినిమా తర్వాత అనిల్ రావిపూడి – బాలయ్య సినిమా చేసే అవకాశం ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్, ఇప్పుడు బాలయ్య కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నాడా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ కథ చాలా బాగా రాసుకున్నారట. భారీ యాక్షన్ ను, మాస్ డైలాగ్ లను బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటారు. అందుకే ఇందులో అవి కూడా ఉండేలా చూస్తున్నారు.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం. బాలయ్య సినిమా కోసం రామారావు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ తర్వాత గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తారు బాలయ్య, ఆ తర్వాత అనిల్ సినిమా పట్టాలెక్కుతుంది.