బాలకృష్ణ నిర్మాత చేతులెత్తేశాడా..బోయపాటి పరిస్థితి ఏంటి..!!

బాలకృష్ణ నిర్మాత చేతులెత్తేశాడా..బోయపాటి పరిస్థితి ఏంటి..!!

0
100

బాలకృష్ణ రూలర్ సినిమా ఇటీవలే వచ్చి భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.. 2019లో బాలయ్యకు వరుసగా ఇది మూడో ఫ్లాప్‌. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా కనీసం పది కోట్లు కూడా రాబట్టుకోలేదంటే ఎంత పెద్ద ఫ్లాపో అర్థం చేసుకోవచ్చు.. అయితే ఈ సినిమా ఫ్లాప్ బాలయ్య నెక్స్ట్ సినిమా పై పడింది..

బాలకృష్ణ నెక్స్ట్ సినిమా ని బోయపాటి శ్రీను దర్శకత్వం లో చేయనుండగా ఆ సినిమా ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుంది.. ఈ చిత్రానికి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. అయితే ఈ సినిమా తెరకెక్కించాలా లేదా అని నిర్మాత ఆలోచనలో పడ్డాడట.. రూలర్ రిజల్ట్ రాక ముందు ఈ బడ్జెట్ పెట్టడానికి నిర్మాత రెడీగానే ఉన్నా, ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాడని తెలుస్తోంది.

ఇప్పటికే వరుస ఫ్లాప్ లలో ఉన్న బాలకృష్ణ కు దాదాపు 70 కోట్ల పెట్టు బడి పెట్టాలా అనేది ఆయన ఆలోచన.. ఇంత బడ్జెట్ అంటే నావల్ల కాదని చేతులెత్తేశాడట. అంతేకాదు. బాలయ్య, బోయపాటి పారితోషికాలు తీసుకోకుండా, లాభాల్లో వాటా తీసుకుంటే.. ఈ ప్రాజెక్టు చేస్తానని చెబుతున్నాడట నిర్మాత. మరి నిర్మాత మాటలు వారు వింటారో లేదో చూడాలి..