బాలకృష్ణ బోయ‌పాటి సినిమాలో హీరోయిన్ ఎవ‌రంటే

బాలకృష్ణ బోయ‌పాటి సినిమాలో హీరోయిన్ ఎవ‌రంటే

0
93

బాలకృష్ణ సినిమా అంటే ఓ రేంజ్ లో అభిమానులు ఆశ‌లు పెట్టుకుంటారు, ఇక బోయ‌పాటితో బాల‌య్య బాబు సినిమా అంటే అది పెద్ద పండుగ అనే చెప్పాలి, ఈసారిమూడో చిత్రం చేస్తున్నారు బోయ‌పాటి బాల‌య్య కాంబో, అయితే ఈ చిత్రం పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు అభిమానులు.

ఇక బాల‌య్య సినిమాలో హీరోయిన్ అంటే ఓ రేంజ్ ఉన్నా భామ‌ని గ్లామ‌ర్ ఉన్న తార‌ని తీసుకుంటారు, అయితే ఇంకా బోయ‌పాటి సినిమాలో హీరోయిన్ ని ఫిక్స్ చేయ‌లేదు, తాజాగా కొత్త హీరోయిన్ ని పరిచయం చేయ‌నున్నార‌ట ఈ చిత్రంలో.

ఒక అందమైన మోడల్ ని బాలకృష్ణ సరసన కథానాయికగా పరిచయం చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో ప్రస్తుతం ముంబై మోడళ్లను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది, త్వరలోనే ఒక అమ్మాయిని ఫైనల్ చేయనున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి, ఇప్ప‌టికే ప‌లువురిని చూశార‌ని చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌..అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంది. ఈచిత్రానికి మోనార్క్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.