హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాని మేలో సెట్స్ పై పెట్టనున్నారు..ప్రీ ప్రొడక్షన్ వర్క్ను మొదలు పెట్టాడు గోపీచంద్ మలినేని…బాలయ్య మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది క్రాక్ సినిమాలో రవితేజను పవర్ఫుల్ పోలీస్ పాత్రలో చూపించిన గోపీచంద్.. ఈసారి బాలయ్యను కూడా పోలీస్ ఆఫీసర్ గా చూపించనున్నారట.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తోంది.. బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.. ఇందులో బాలయ్య రోల్ గురించి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఎందుకంటే ఈ చిత్రంలో ఫ్యాక్షనిస్ట్ కలెక్టర్ పాత్రతో పాటు అఘోరా పాత్రలో నటిస్తున్నారు బాలయ్య అని వార్తలు వినిపిస్తున్నాయి..గాడ్ ఫాదర్ అనే టైటిల్ దీనికి పరిశీలిస్తున్నారట. ఇక గతంలో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేశారు.అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
|
|
|
బాలకృష్ణ – గోపీచంద్ సినిమా – పవర్ ఫుల్ పాత్రలో బాలయ్య
-