బాలకృష్ణ గోపీచంద్ సినిమాలో హీరోయిన్ గా ఆమె పేరు పరిశీలన ?

అఖండ చిత్రం పై టాలీవుడ్ టాక్

0
120

బాలకృష్ణ ప్రస్తుతం అఖండ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చేసింది. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన నటించేది ఎవరు అనేదానిపై టాలీవుడ్ లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ వార్తల ప్రకారం చూస్తే నయనతార, త్రిష ,శ్రుతిహాసన్ పేర్లు వినిపించాయి.

 

ఇప్పుడు తాజాగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. మెహ్రీన్ ని ఈ సినిమాలో తీసుకునేందుకు పరిశీలిస్తున్నారట. మెహ్రీన్ కి ఈ మధ్యనే పెళ్లి కుదిరింది అందువలన ఆమె కొంత కాలంగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం ఆమె ఎఫ్ 3 సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమా మినహా మరే సినిమా ఆమె ప్రస్తుతం ఒప్పుకోలేదు.

బాలకృష్ణ సినిమాను ఆమె అంగీకరించే అవకాశాలైతే ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. చూడాలి దీనిపై అధికారిక ప్రకటన రావాలి, ఈ సినిమాలో బాలయ్య బాబుని డిఫరెంట్ గా చూపించాలని చూస్తున్నారట గోపిచంద్ మలినేని.