టాలీవుడ్ లో సాంఘికమైనా.. జానపదమైనా.. పౌరాణికమైనా.. చారిత్రాత్మకమైనా ఆనాడు ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఆ పాత్రలు చేయాలి అంటే కచ్చితంగా సూట్ అయ్యేది నందమూరి బాలయ్య అనే చెప్పాలి, ఆయన అద్బుతమైన నటుడు అంతేకాదు
ఇలాంటి చిత్రాలు చేయాలి అంటే ఆయనకు ఇష్టం, దర్శకులకి కూడా పలు సలహాలు ఇస్తారు ఆయన, ముఖ్యంగా ఆయనకు ఇలాంటి పురాణాలపై పట్టు ఉండటంతో ఈ పాత్రలకు ఆయన ఎంతో న్యాయం చేస్తారు.
బాలయ్య చేసిన గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం సూపర్ హిట్ అయింది, తాజాగా ఆయన మరో చిత్రం పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.తెలంగాణ పోరాటయోధుడు, కాకతీయ రుద్రమ కాలం నాటి వీరుడు గోన గన్నారెడ్డి పాత్రను పోషించాలని ఆయన కోరుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ కథపై ఫోకస్ చేస్తూ కొందరు దర్శకులు బిజీగా ఉన్నారట, ఆయన గురించి వివరాలు తక్కువ ఉన్నాయి, వాటిని చరిత్ర నుంచి తీసుకుంటున్నారట, దీనికంటూ ఓ బృందం ఏర్పాటు చేశారట బాలయ్య ,బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తి అయ్యాక ఈ సినిమా ఓకే చేస్తారు అని వార్తలు వస్తున్నాయి, మరి దర్శకత్వ బాధ్యతలు ఎవరు తీసుకుంటారో చూడాలి.