బాలయ్య సినిమా టీజర్….ఫ్యాన్స్ కి పండగే

బాలయ్య సినిమా టీజర్....ఫ్యాన్స్ కి పండగే

0
124

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కి సి కళ్యాణ్ నిర్మాత గా వ్యవహరిస్తుండగా, షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బాలకృష్ణ 105వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో సోనాల్ చౌహాన్ – వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు.. కాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అక్టోబర్ 5 నుండి ప్రారంభం అవుతుండగా బాలకృష్ణతో పాటు ప్రధాన పాత్రధారులు పాల్గొనగా కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు.

ప్రకాశ్ రాజ్ .. జయసుధ .. భూమిక పాత్రలు ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. చిరంతన్ భట్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుందని చెబుతున్నారు. దసరా కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు.