మరో ఫ్యామిలీ హీరోని బాలయ్యకి విలన్ గా చూపించనున్న బోయపాటి

మరో ఫ్యామిలీ హీరోని బాలయ్యకి విలన్ గా చూపించనున్న బోయపాటి

0
115

సినిమా ఇండస్ట్రీలో గతంలో హీరోలుగా చేసిన వారు మంచి పాత్ర వస్తే ప్రతినాయకుడిగా చేయడానికి రెడీ అవుతున్నారు, ఇలా ఎందరో ఆనాటి కంటే నేటి గుర్తింపుతో సంతోషంగా ఉన్నాము అంటున్నారు, మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో జగపతిబాబు గురించి చెప్పాలి, ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కు హీరోగా ఎంతో దగ్గర అయ్యారు, అయితే అవకాశాలు తగ్గిన తర్వాత ఆయన ప్రతినాయకుడి పాత్రలతో ఆనాటి పేరు కంటే వంద రెట్లు సంపాదించారు, భారీ రెమ్యునరేషన్ అందుతోంది.

ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కొనసాగాలి అని ఫ్యాషన్ తో చాలా మంది వచ్చిన అవకాశాలు చేస్తున్నారు. తాజాగా
దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా కోసం మరో ఫ్యామిలీ హీరోను నెగిటివ్ గా చూపించబోతున్నాడట. అయితే తాజాగా ఈ వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

లెజెండ్ సింహా సినిమాల్లో జగపతి బాబు పాత్రకు అందరూ ఫిదా అయ్యారు, ఇక వినయ విధేయ రామ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ వివేక్ ఒబేరాయ్ ని కూడా పవర్ఫుల్ విలన్ గా చేయించారు, తాజాగా సీనియర్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ని పూర్తిగా నెగిటివ్ పాత్రలో చూపించడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది, ముందు సోనూసూద్ ని ఈ పాత్ర కోసం అనుకున్నారట, కాని ఆయన ప్లేస్ లో శ్రీకాంత్ ని పరిశీలిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎవరు ఈ పాత్ర చేస్తారో.