ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఈయన బయట కనిపించడం లేదు. ప్రస్తుతం ఈయన వరస సినిమాలకు కమిట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పటికే వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉన్నా కూడా అది కుదర్లేదు. ఇక దాంతో పాటు బోయపాటి శ్రీను కాంబినేషన్లోనూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య. అయితే ఈ చిత్రం కూడా అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా మొదలయ్యేలా కనిపిస్తుంది.
కాగా నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు కేఎస్ రవికుమార్ రూపొందించనున్న సినిమా ను కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు. వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా .. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేయగా .. ముహూర్తపు సన్నివేశానికి కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకి ‘క్రాంతి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనీ, పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ కనిపించనున్నాడని అంటున్నారు. కథానాయికల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. ‘జై సింహా’ తరువాత బాలకృష్ణ – కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి వుంది.