నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. 105 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగా బాలకృష్ణ తన డబ్బింగ్ పనులను మొదలుపెట్టాడని సమాచారం.. శబ్ధాలయ స్టూడియోస్ లో బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారత..
సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కు సంగీతం అందించిన చిరంతన్ భట్ ఈ సినిమా కి సంగీతం అందిస్తుండగా సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు..హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు.