NTR హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన బాలకృష్ణ..ఏమన్నారంటే?

0
80

NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ వైసిపి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అనేది ఓ పేరు కాదు. తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చారు. ఇప్పుడు కొడుకు గద్దెనెక్కి హెల్త్ వర్సిటీ పేరు మార్చారు. మిమ్మల్ని కూడా మార్చడానికి ప్రజలున్నారు. పంచభూతాలున్నాయని బాలకృష్ణ మండిపడ్డారు.