ఓ వైపు బాలయ్య – మరో వైపు రాజశేఖర్ శ్రియ బిజి బిజీ

ఓ వైపు బాలయ్య - మరో వైపు రాజశేఖర్ శ్రియ బిజి బిజీ

0
99

ఈ మధ్య టాలీవుడ్ లో రాజశేఖర్ కు మరిన్ని హిట్ సినిమాలు వస్తున్నాయి… ఆయన వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు.. ఇక గరుడవేగ తర్వాత ఆయన కల్కి చిత్రంలో నటించారు, ఈ సినిమా మంచి కలెక్షన్లు తీసుకువచ్చింది.. ఈ రెండు చిత్రాలు వసూళ్లు సూపర్ అనే చెప్పాలి.. తాజాగా రాజశేఖర్ తో ఓ సినిమాలో నటించేందుకు శ్రియ ఒకే చెప్పిందట.

అహ నా పెళ్ళంట, పూలరంగడు సినిమాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం చౌదరికి తన తదుపరి సినిమాను అప్పగించారు హీరో రాజశేఖర్ . ఇక ఈ సినిమాకు సరైన హీరోయిన్ కావాలి అని చూశారు దర్శకులు , ఈ సమయంలో శ్రియని ఎంపిక చేసుకున్నారట. ఆమె కూడా కథ నచ్చడంతో ఒకే చెప్పింది అని తెలుస్తోంది.

ఓవైపు హుందాగా ఉండాలి అలాగే గ్లామర్ ఒలికించే పాత్ర కూడా ఇందులో ఉందట. ఇక శ్రియ బాలయ్య బోయపాటి చిత్రంలో కూడా నటిస్తోంది అని వార్తలు వస్తున్నాయి, అయితే ఇంకా ఆ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.. ఇటు రాజశేఖర్ చిత్రంలో మాత్రం ఆమెని ఫిక్స్ చేశారట, దీని తర్వాత కన్నడ రీమేక్ చిత్రంలో రాజశేఖర్ నటించనున్నారట