Daaku Maharaj | డల్లాస్‌లో ‘డాకు మహారాజ్’ వేడుకలు..

-

నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఈ పేరుకున్న ఫేమ్ అంతా ఇంతా కాదు. అతని పవర్ ఫుల్ డైలాగ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బాలయ్య తాజాగా ‘డాకు మహారాజ్(Daaku Maharaj)’ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 2025 సంక్రాంతి బరిలో ఈ డాకును నిలబెట్టడానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పక్కాగా సంక్రాంతి సందర్భంగా ‘డాకు మహారాజ్’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను కూడా జోరుగానే చేయాలని ప్లాన్ చేస్తుంది. అందుకోసం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.

- Advertisement -

సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12న ‘డాకు మహారాజ్(Daaku Maharaj)’ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జనవరి 4న అమెరికాలోని డల్లాస్ వేదికగా నిర్వహించనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను బాబీ.. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై బాలయ్య అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి వారి అంచనాలను ఈ సినిమా అధిగమిస్తుందో లేదో చూడాలి.

Read Also: కమెడియన్ అలీకి నోటీసులు.. ఎందుకంటే..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...