బాలకృష్ణ భార్య వసుందర సంతకం ఫోర్జరీ ఎంత స్కెచ్ వేశారంటే

బాలకృష్ణ భార్య వసుందర సంతకం ఫోర్జరీ ఎంత స్కెచ్ వేశారంటే

0
85

బాలయ్య బాబు రాజకీయంగా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ,తాజాగా ఆయన కుటుంబం గురించి ఓ వార్త వినిపిస్తోంది, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకం ఫోర్జరీ చేసిన బ్యాంకు ఉద్యోగిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశమైంది.

బాలయ్యబాబు భార్య వసుంధరకు హెచ్డిఎఫ్ సీ బ్యాంకు బంజారాహిల్స్ బ్రాంచిలో ఖాతా ఉంది. ఆమె ఇటీవల మొబైల్ యాప్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు బ్యాంకు అధికారులకు సమాచారం అందింది. దీన్ని ధ్రువీకరించుకునేందుకు బ్యాంకు రిలేషన్షిప్ మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్ శనివారం ఆమెకు ఫోన్ చేశారు. కాని ఆమె మాత్రం తాను యాప్ కోసం ఫోన్ చేయలేదు అని తెలిపారు

దీంతో మరి ఇది అప్లై చేసింది ఎవరు సంతకం చేసింది ఎవరు అనేది తెలుసుకున్నారు, ధరఖాస్తు ఫారం పై సంతకం వేరే వారు చేశారు అని తేలింది…బ్యాంకులో కొత్తగా చేరిన అకౌంటెంట్ కొర్రి శివ ఈ పని చేసినట్టు నిర్ధారించారు. అతడే వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. దీనిపై ఆమె ఆర్ధిక వ్యవహారాలు చూసుకునే వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, దీంతో సినీ రాజకీయ పారిశ్రామిక వేత్తల కుటుంబాలు అలర్ట్ అయ్యారు.