నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భగవంత్ కేసరి(Bhagavanth Okesari)’. నేడు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా చిత్ర టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. తెలంగాణ యాసలో బాలయ్య పలికిన డైలాగ్స్ అదిరిపోయాయి. ‘అడవి బిడ్డా.. నేలకొండ భగవంత్ కేసరి’ అంటూ యాక్షన్‌లోకి దిగడం.. ‘ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది’ అనే డైలాగ్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు. బాలయ్య సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదలకానుంది.
- Advertisement -