బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ? దర్శకుడు ఎవరంటే?

Balakrishna's son Mokshagna Teja Enters in movies

0
101

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే గత రెండు సంవత్సరాలుగా మోక్షజ్ఞ ఎంట్రీపై ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే బాలయ్య కూడా దీనికి సమయం ఉంది. తనయుడి సినిమా ఎంట్రీ ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు.

మోక్షజ్ఞ సినిమా పై ఎన్నో గాసిప్స్ వైరల్ అయ్యాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడటం లేదు. తాజాగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మరో వార్త బయటికి వచ్చింది. హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందన్నది ఈ వార్త. అయితే ఆదిత్య 369 సీక్వెల్ చేయాలని బాలయ్య ఎప్పటి నుంచో చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకి బాలయ్య బాబు దర్శకత్వం వహించి. హీరోగా మోక్షజ్ఞతో సినిమా చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాకి బాలయ్య బాబు దర్శకత్వం వహించాలని భావిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇది వాస్తవమా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.