నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ సినిమాలు అంటే బాలయ్య బాబు గుర్తు వస్తారు, ఇక ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ సినిమాలతో బాలయ్య ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేశారో తెలిసిందే.. నటనలో బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపిస్తారు. అందుకే ఆయనకు రాసే కథ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.. ఇక ప్రతినాయకుడి పాత్ర కూడా తనకు తగ్గ రేంజ్ లో ఉండాలి అని బాలయ్య భావిస్తారు.. అందుకే ఆయన చిత్రాలన్ని విలన్ రోల్స్ చాలాపేరు తెచ్చుకుంటాయి.
ఇక తాజాగా ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో వారి కాంబోలో మూడో చిత్రం చేస్తున్నారు, ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది, అయితే తాజాగా మరో సినిమాకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే వార్తలు వస్తున్నాయి.
కందిరీగ రభస అల్లుడు అదుర్స్ ఈ చిత్రాలు చేసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథ బాలయ్యకు నచ్చిందట, దీంతో ఈ పవర్ ఫుల్ ప్యాక్ సినిమాని బాలయ్య త్వరలో పట్టాలెక్కించనున్నారు.. ఇక టైటిల్ కూడా వైరల్ అవుతోంది..బలరామయ్య బరిలో దిగితే అనే టైటిల్ తో దర్శకుడు ఓ పవర్ ఫుల్ సబ్జెక్టును బాలయ్యతో చేయనున్నారట.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతోందట, ఈ చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మలు ఉండే అవకాశం ఉంది.