బాల‌య్య అభిమానుల‌కి పండుగ బోయ‌పాటి సినిమా అప్ డేట్

బాల‌య్య అభిమానుల‌కి పండుగ బోయ‌పాటి సినిమా అప్ డేట్

0
86

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో సినిమా స్టార్ట్ అయింది.. ఈ చిత్రంలో బాల‌య్య బాబు గెట‌ప్ గురించి అనేక వార్త‌లు వినిపిస్తున్నాయి, అయితే క‌ధ గురించి ఎవ‌రికి తెలియ‌క పోయినా అనేక వార్త‌లు మాత్రం టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి, ఇప్ప‌టికే అఘోరాగా బాల‌య్య ఇందులో క‌నిపిస్తారు అని వార్త‌లు వినిపించాయి… కాశీలో షూటింగ్ జ‌రుపుకుంటారు అని అన్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో బాల‌కృష్ణ క‌వ‌ల‌లుగా క‌న‌ప‌డ‌బోతున్నారు. అప్పుడెప్పుడో రాముడు భీముడు, అపూర్వ స‌హోదరులు చిత్రంలో క‌వ‌ల‌లుగా న‌టించిన బాల‌కృష్ణ క‌వ‌ల‌లుగా క‌నిపించ‌లేద‌ని చెప్పాలి. మ‌ళ్లీ ఇప్పుడు బాల‌య్య క‌వ‌ల‌ల క్యారెక్ట‌ర్ లో అల‌రించ‌నున్నార‌ట‌.

ఇక ఈచిత్రంలో ఇద్ద‌రు క‌వ‌ల‌లు చిన్న‌త‌నంలో విడిపోతారు ఒక‌రు కాశీ, మ‌నొక‌రు అనంత‌పూర్ లో క‌నిపిస్తార‌ట‌, అక్కడ అఘోరాగా బాల‌య్య ఉంటాడ‌ట‌.. ఇక్క‌డ ఇద్ద‌రూ ఇంట‌ర్వెల్ లో క‌లిసే సీన్ ఉంటుంద‌ట‌… శ్రియా శ‌ర‌న్‌, అంజ‌లి హీరోయిన్స్‌గా న‌టిస్తార‌ట‌. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.