బాలయ్య అభిమానులకు సూపర్ న్యూస్

బాలయ్య అభిమానులకు సూపర్ న్యూస్

0
104

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 105 వ సినిమా రూలర్ ఈ సినిమా లుక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతో ట్రెండ్ రికార్డు చేస్తున్నాయి.ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో రెండు వరుస ఫ్లాప్స్ చవిచూసిన బాలకృష్ణ ఫుల్ మాస్ కమర్షియల్ విధానంలో ఈ సినిమాలో నటించారు అని తెలుస్తోంది.

ఇక గత ఏడాది ఆయన జై సింహతో మంచి హిట్ సంపాదించారు, కే ఎస్ రవికుమార్ తో అనుకున్నట్లే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఆయన. లెజెండ్, డిక్టేటర్ సినిమాల్లో నటించిన సోనాల్ చౌహన్, ఆయన సరసన నటిస్తోంది, ఇక సినిమా చిత్రీకరణ చివరి షెడ్యూల్ కూడా పూర్తి అయింది అని తెలుస్తోంది.

అంతేకాదు ఈ సినిమాలో భూమిక చావ్లా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. అయితే బాలయ్య కోసం ముందు టీజర్ ట్రైలర్ తర్వాత రోజుకో సాంగ్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.