బాలయ్య, బోయపాటి సినిమాలో ఆనాటి హీరోయిన్ కు ఛాన్స్ ఎవరంటే

బాలయ్య, బోయపాటి సినిమాలో ఆనాటి హీరోయిన్ కు ఛాన్స్ ఎవరంటే

0
94

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అభిమానులు ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ వస్తుందా అనిఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రానికి BB3 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఇక వచ్చే నెల నుంచి మళ్లీ బ్రేక్ ఇచ్చిన షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక లెజెండ్, సింహా లాంటి విజయాల తర్వాత ఇద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కాబట్టి ఇందులో పవర్ ఫుల్ పాత్ర ఉంటుంది అంటున్నారు,
అయితే ఈ సినిమాలో హీరోయిన్ని ఇంకా ఫిక్స్ చేయలేదు,బాలీవుడ్ నుంచి కొత్త నటిని తీసుకుంటారు అని ప్రచారం జరిగింది.

కాని తాజాగా మాజీ హీరోయిన్ అలనాటి క్రేజీ హీరోయిన్ ని తీసుకోవాలి అని చూస్తున్నారట, అయితే సినిమా పేరు విషయంలో కూడా మోనార్క్, టార్చ్ బేరర్, సూపర్ మేన్.మొనగాడు, డేంజర్ అనే పేర్లు వినిపిస్తున్నాయి, తాజాగా ఈ జాబితాలో యమ డేంజర్ వచ్చింది.

ఇక తాజాగా హీరోయిన్ సిమ్రాన్ పేరు వినిపిస్తోంది.. బాలయ్యతో పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఆమె గతంలో చేసిన విషయం తెలిసిందే..సమర సింహా రెడ్డి, గొప్పింటి అల్లుడు,నరసింహనాయుడు,
సీమ సింహం, ఒక్క మగాడు చిత్రాల్లో నటించారు, హిట్ జోడి కావడంతో ఆమె పేరు పరిశీలిస్తున్నారట…సిమ్రాన్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఎసిపోడ్లో నటించనున్నారట.