బాలయ్య చిత్రంలో హీరోయిన్ చెంజ్…

బాలయ్య చిత్రంలో హీరోయిన్ చెంజ్...

0
98

హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ మరో చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే… ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్, సింహా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే… ఇక ఇప్పుడు ( బీబీ3 వర్కింగ్ టైటిల్ ) వస్తుండటంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు…

వాస్తవానికి ఈ చిత్రం కరోనా మహమ్మారి రాకుంటే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకునేది, కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా ఇంకా షూటింగ్ పూర్తికాలేదు… ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ మార్చారు.. ముందుగా సాయేషా, బాలయ్యకు సరసనగా ఫిక్స్ చేశారు…

అయితే ఊహించని కారణాల వల్ల తాజా షెడ్యూల్ ప్రారంభం అయ్యే సమయానికి ఆమె చిత్రీకరణలో పాల్గొనలేని పరిస్థితి వచ్చింది దీంతో చిత్ర యూనిట్ ఆమె స్థానంలో ప్రగ్యాజైశ్వాల్ ని ఎంపిక చేశారు…