బాలయ్య సినిమాకి బ్రేకులు నిర్మాత క్లారిటీ

బాలయ్య సినిమాకి బ్రేకులు నిర్మాత క్లారిటీ

0
127

నందమూరి నటసింహం బాలయ్య బాబు తాజాగా చేస్తున్న చిత్రం రూలర్ క్రియేటీవ్ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు, మంచి మాస్ ఎలిమెంట్ తో సినిమా షూటింగ్ జరుగుతోంది బాలయ్య బాబు స్టిల్స్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి.

ఈ సినిమాలో.. బాలయ్య పాత్ర చాలా ఆసక్తిగా ఉంది. ముందు చాలా స్లిమ్గా గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించిన బాలయ్య.. ఆ తరువాత.. పోలీస్ పాత్రలో కనిపించి.. అభిమానులను అలరించారు.మరి బాలయ్య బాబు సినిమాలు అంటే హీరోయిన్లు కూడా అంతేగ్లామర్ గా ఉంటారు మరి ఆయన సరసన
సోనాల్ చౌహాన్, వేదికలు నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని డిసెంబర్ 20కి రిలీజ్ చేస్తారని మొదట అందరూ భావించినా.. వాయిదా వేసి.. డిసెంబర్ 28కి రిలీజ్ చేయాలని పకడ్బందీగా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. కాని ఇప్పుడు బాలయ్య బాబు సరసన నటిస్తున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అని వార్తలు వచ్చాయి దీంతో చాలా వరకూ షూటింగ్ అవ్వడంతో ఇప్పుడు సినిమా ఏమవుతుందా అని అభిమానులు ఆందోళన చెందారు.

అయితే తాజాగా ఈ రూమర్స్పై ప్రొడ్యూసర్ సీ కళ్యాణ్ స్పందించారు. ఇది కేవలం రూమర్ మాత్రమే అని.. సోనాల్ చౌహాన్ షూటింగ్లో ఉందని.. కచ్చితంగా అనుకున్న సమయానికి సినిమా విడుదల చేస్తాం అని తెలియచేశారు.