బాలయ్య సినిమాలో బోయపాటి అదిరిపోయే పారితోషికం

బాలయ్య సినిమాలో బోయపాటి అదిరిపోయే పారితోషికం

0
93

బాలయ్య బాబు తాజాగా రూలర్ సినిమా చేశారు.. ఈ చిత్రం ప్రమోషన్స్ కు రెడీ అవుతోంది.. టీజర్, ట్రైలర్, పాటలు అభిమానులని ఖుషీ చేస్తున్నాయి.
కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా అలా ఉంటే మరో సినిమా ప్లాన్ చేశారు బాలయ్య, అవును తాజాగా ఆయన బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే

70 కోట్ల బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి గాను బాలకృష్ణ 10 కోట్ల పారితోషికాన్ని అందుకుంటూ ఉండగా, బోయపాటి పారితోషికం 15 కోట్లు అని తెలుస్తోంది. హీరో కంటే డైరెక్టర్ కు అత్యధిక పారితోషికం అంటే ఈ సినిమానే అని ఇది రికార్డు అని చెబుతున్నారు అభిమానులు.. వినయ విధేయ రామ వంటి భారీ పరాజయం తరువాత ఆయన ఆ స్థాయిలో డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది టాలీవుడ్ లో.

అయితే బాలయ్య బాబు మార్కెట్ భారీగా పెరిగింది. ఇక రూలర్ కూడా సక్సస్ అయితే , బోయపాటి సినిమా దాదాపు 150 కోట్ల బిజినెస్ చేస్తుంది అని అంచనా వేస్తున్నారు చిత్ర యూనిట్.. అందుకే బాలయ్యకు బోయపాటికి ఈ రేంజ్ పారితోషికం ఇస్తున్నారట. ఇంకా హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు చిత్ర యూనిట్