బాలయ్య సినిమాలో రోజా బోయపాటి కొత్త రోల్

బాలయ్య సినిమాలో రోజా బోయపాటి కొత్త రోల్

0
100

బోయపాటి శ్రీను విభిన్న కథలతో సినిమాలకు రెడీ అవుతున్నారు.. ఆయన వినయ విధేయ రామ చిత్రం తర్వాత పవర్ ఫుల్ స్టోరీ కోసం కసరత్తులు చేస్తున్నారు ..అయితే బాలయ్య బాబుతో మరో గ్రాండ్ ప్రాజెక్ట్ చేస్తున్నారనే విషయం తెలిసిందే.. ఈ నెలలో ఈ షూటింగ్ కూడా స్టార్ట్ అవనుంది.

ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పవర్ఫుల్ పాత్రలో రోజా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మిగతా పాత్రల ఎంపికపై బోయపాటి దృష్టిపెట్టినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ అట..అయితే రాజకీయాలు సినిమాలు వేరు కాబట్టి ఈ సినిమాలో రోజాకు బాలయ్యకు మధ్య విభేదాలు ఏమీ ఉండవు అని అంటున్నారు..రాజకీయాలు వేరు సినిమాలు వేరు కాబట్టి ఇద్దరూ ఈ పాత్రలు చేస్తారు అని అంటున్నారు.

అయితే ఆమె ఈ సినిమాకి ఒకే చెప్పారా లేదా అనేది తెలియాలి ..అయితే బాలయ్య తో మాత్రం ఇఫ్పటికే చర్చించారట.. మరో వారంలో ఈ సినిమాలో ఆ పాత్ర రోజా చేస్తారా లేదా అనేది తెలుస్తుంది ..లేకపోతే కోలీవుడ్ సీనియర్ నటిని ఈ పాత్ర కోసం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.