బాలయ్య సినిమాలో రెండో హీరోయిన్ని ఫిక్స్ చేసిన బోయపాటి

బాలయ్య సినిమాలో రెండో హీరోయిన్ని ఫిక్స్ చేసిన బోయపాటి

0
91

బోయపాటి సినిమాలు పక్కా మాస్ ఎంటర్ టైన్మెంట్ లో ఉంటాయి. ఆయన హీరోయిజానికి అలాగే ప్రతినాయకుడి పాత్రకు చాలా హైప్ ఇస్తారు అనేది తెలిసిందే.. రెండు పాత్రలు సినిమాకి రెండు కళ్లుగా మారతాయి.. ఇక బాలయ్య బాబు సినిమాలు చూస్తే బోయపాటి ఆ కాంబినేషన్ పక్కాగా అమలు చేస్తాడు.. సింహ లెజెండ్ సినిమాలో కూడా అదే చేశాడు.

అయితే సినిమాలో హీరోయిన్ విషయంలో కూడా బోయపాటి అదే పందా ఆలోచిస్తారు. బోయపాటి బ్యూటీగా రెండు సార్లు రిపీట్ అయింది..నయనతార, రకుల్ ప్రీత్ మాత్రమే. తులసి సింహా సినిమాల్లో నయనతారని, సరైనోడు, జయ జానకి నాయక చిత్రాల్లో రకుల్ ని రిపీట్ చేశాడు బోయపాటి శ్రీను, తర్వాత మళ్లీ అలా రిపీట్ చేయలేదు.

అయితే సరైనోడు సినిమాలో హీరోయిన్ కేథరిన్ ని తీసుకున్నారు, తాజాగా మరోసారి బాలయ్య సినిమాలో ఆమె పేరు తెరపైకి వచ్చింది. తాజాగా బాలయ్య బాబు సరసన రెండో హీరోయిన్ గా ఆమె పేరు ఫైనల్ అయింది అని తెలుస్తోంది. మరోసారి బోయపాటి ఆమెని సినిమాలోకి తీసుకుంటున్నారు అని తెలుస్తోంది, సో చూడాలి ఆమెకు అవకాశం వస్తుందా లేదా మరెవరికైనా ఇస్తారా అనేది.