బాలయ్య సినిమాలో ఇద్దరు హీరోయిన్లు – టాలీవుడ్ టాక్

బాలయ్య సినిమాలో ఇద్దరు హీరోయిన్లు - టాలీవుడ్ టాక్

0
90

క్రాక్ సినిమా గోపీచంద్ మలినేనికి మంచి హిట్ ఇచ్చింది, ఇక తాజాగా ఆయన బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఇక టాలీవుడ్ లో కొద్ది రోజులుగా దీని గురించి చర్చ జరుగుతోంది. బాలయ్య అభిమానులు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు అయితే ..

సమాజంలోని కొన్ని సంఘటనల ఆధారంగా బాలకృష్ణ కోసం గోపీచంద్ కథను తయారు చేశారని

తెలుస్తోంది. ఇటీవల వేటపాలెం లైబ్రరీకీ వెళ్ళి, మెటీరియల్ ను సేకరించుకున్నారు అని వార్తలు వినిపించాయి….అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమా చేస్తున్నారు ఈ సినిమా పూర్తి అయ్యాక ఈ చిత్రం చేసే అవకాశం ఉంది, ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఫస్ట్ టైమ్ బాలకృష్ణ నటిస్తుండటంతో నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారట. ఇక యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.