బాలయ్య జోడీగా యంగ్ హీరోయిన్

బాలయ్య జోడీగా యంగ్ హీరోయిన్

0
102

హీరో నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బీబీ3 చిత్రం (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే…ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి…. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న బీబీ3 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి…

ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడు… ఇప్పటికే లాక్ డౌన్ కు ముందు ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ఇక లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభించింది… ఈ చిత్రంలో ఒక పాత్రకు బాలయ్యకు హీరోయిన్ గా అవున్ ఫేమ్ పూర్ణనిని తీసుకున్నారు…

ఇక మిగిలిన రెండో పాత్రకు కూడా హీరోయిన్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి… సాయేషా సైగల్ ని బాలయ్యకు జోడీగా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి… ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ సినిమా అఖిల్ ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే…