బాలయ్య‍ కమల్ హాసన్ మల్టీస్టారర్

బాలయ్య‍ కమల్ హాసన్ మల్టీస్టారర్

0
101

బాలయ్య సినిమా అంటే అభిమానులకు ఎంతో హైప్ ఉంటుంది.. మరీ ముఖ్యంగా బాలయ్య ఏ సినిమా రోల్ అయినా నటనలో ఆరితేరిపోయిన నటుడు అనే చెప్పాలి.. పౌరాణిక చిత్రాలు కూడా బాలయ్యలా మరెవరూ చేయలేరు. ఇప్పటి నటులలో, అయితే యూనివర్సల్ హీరో కమల్ హాసన్,నందమూరి బాలకృష్ణ గురించి ఇప్పుడు ఓ వార్త వైరల్ అవుతోంది. గతంలో వీరిద్దరు కలిసి ఓ సినిమా ప్లాన్ చేశారుట. కాని అది పట్టాలెక్కలేదట.

ఆదిత్య 369 చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ ..శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్గా రెండు పాత్రల్లో అద్భుతాభినయాన్ని కనబరిచారు. సింగీతం శ్రీనివాస రావు డైరెక్ట్ చేశారు
ముందుగా కృష్ణ కుమార్ పాత్ర కోసం కమల్ హాసన్ను అనుకున్నారట దర్శక నిర్మాతలు. ఎందుకంటే.. సింగీతం అంతకు ముందు కమల్ హాసన్తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అయితే కమల్ ముందు ఈ సినిమా చేస్తాను అన్నారు.. కాని అప్పటికే రెండు పెద్ద సినిమాలు చేతిలో ఉండటంతో డేట్స్ కుదరలేదట.. అందుకే రెండు పాత్రల్లో బాలయ్య బాబు నటించారు మొత్తానికి విశ్వనటుడు అందులో నటించి ఉంటే సినిమా మరింత రేంజ్ కు వెళ్లేది అంటున్నారు బాలయ్య బాబు అభిమానులు.