బాలయ్యని మరోసారి ఆ రోల్ లో చూపించేందుకు స్టోరీ సిద్దం చేస్తున్న దర్శకుడు ?

బాలయ్యని మరోసారి ఆ రోల్ లో చూపించేందుకు స్టోరీ సిద్దం చేస్తున్న దర్శకుడు ?

0
90

సినిమాలు అనేది ఒక్కో జోనర్ లో ఉంటాయి, అయితే తెలుగులో కూడా ఇలా అనేక జోనర్స్ లో సినిమాలు వచ్చాయి, ఇక ఫ్యాక్షన్ కథలపై సినిమాలు మన తెలుగు చిత్ర సీమలో ఓ ఊపు ఊపేశాయి… అయితే అందరి కంటే ఎక్కువగా బాలయ్య బాబుకి ఈ సినిమాలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.. అన్నీ చిత్రాలు వంద రోజులు అన్నీ సెంటర్లలో ఆడేవి, అందుకే ఫ్యాక్షన్ స్టోరీలు అంటే దర్శకులు ముందు బాలయ్య బాబుకి స్టోరీ చెప్పేవారు.

 

అయితే ఇటీవల కాలంలో ఆయన ఈ జోనర్ లో సినిమా చేయలేదు. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని మూవీలో ఆయన ఫ్యాక్షనిజం స్టోరీలో నటిస్తున్నారు అనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది,

ఈ చిత్రంలో ఆయన కొంతసేపు ఫ్యాక్షన్ లీడర్ గా పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తారని అంటున్నారు.

 

 

ఈ పాత్రని ఆయన కోసం చాలా కొత్తగా పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తున్నారట గోపిచంద్ , ఇద్దరు ముద్దుగుమ్మలు ఇందులో నటించే అవకాశం ఉంది అని తెలుస్తోంది…జూన్ 10వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ టాక్… ఎందుకు అంటే ఆరోజు బాలయ్య బాబు పుట్టిన రోజు.. చూడాలి ఈ ప్రకటన కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.