బాల‌య్య‌ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

బాల‌య్య‌ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

0
97

టాలీవుడ్ లో క‌రోనా బాధితుల కోసం పెద్ద ఎత్తున సాయం అందిస్తున్నారు సినిమా న‌టులు.. ఇక మెగాస్టార్ ఇచ్చిన పిలుపు మేర‌కు పెద్ద ఎత్తున మ‌న‌సున్న మ‌హ‌రాజులు సాయం చేసి పేద క‌ళాకారుల‌ని ఆర్టిస్టుల‌ని ఆదుకుంటున్నారు.. ఇక తాజాగా బాల‌య్య కూడా త‌న వంతు సాయం అందించారు. ఈ సమ‌యంలో .

డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ హీరో మెగాస్టార్ ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఛారిటీకి నట సింహం బాలకృష్ణ రూ.25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అలాగే.. ఓ 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, మరో 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు.

ఈ స‌మ‌యంలో బాల‌య్య చేసిన సాయంతో చిరు ఇలా ఆయ‌న‌ని అభినందించారు, ఈ స‌మ‌యంలో బాల‌య్య నిర్మాత సి క‌ల్యాణ్ కు ఈ చెక్ అంద‌చేశారు. మొత్తం కోటి 25 ల‌క్ష‌లు సాయం చేశారు బాల‌య్య‌…ప్రతి కష్టసమయంలోనూ, ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే, మీరెప్పుడు తోడుంటారని ట్వీట్‌లో తెలిపారు మెగాస్టార్.