బాలయ్యపై పోసాని సంచలన కామెంట్స్

బాలయ్యపై పోసాని సంచలన కామెంట్స్

0
112

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రచయితగా .. దర్శకుడిగా .. నటుడిగా పోసాని కృష్ణమురళికి ప్రత్యేకమైన స్థానం వుంది,ఆయన సినిమాలో ఉన్నారు అంటే సంథింగ్ స్పెషల్ అనుకుంటారు.. ఆయన నటన అంత బాగుంటుంది, ఆయన డైలాగ్ డెలివరీ కూడా చాలామందికి ఇష్టం.

అయితే ఆయన రాజకీయాల్లో కూడా ఇటీవల బాగా యాక్టీవ్ గా ఉన్నారు.. వైసీపీ తరపున ఆయన రాజకీయంగా ఉన్నారు,
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతుండగా, బాలకృష్ణ గురించిన ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. బాలకృష్ణ గారి సినిమాలకి నేను రచయితగా పనిచేశాను .. చాలా మంచి మనిషి, ఆయనతో కలిసి రెండు సినిమాలు చేశాను అని తెలిపారు ఆయన.

అంతేకాదు బాలయ్య బాబుకి కోపం ఎక్కువ అది నిజమే ఆ కోపానికి కూడా కారణం ఉంది అని కీలక కామెంట్స్ చేశారు.
కావాలని ఆయన ఎవరినీ ఏమీ అనరు. తనకి అనిపించింది ముఖాన్నే చెప్పేస్తారు .. మనిషి ముందు ఒక మాట .. తరువాత ఒకమాట ఆయనకి తెలియదు. ఏదైనా ఒకే మాట మాట్లాడుతాడు, ఆయన అందరిని సమానంగా చూస్తారు అని చెప్పారు,, ఎవరికైనా సమస్య ఉన్నా పట్టించుకుంటాడు అవినీతి అక్రమాలు అనేవి తెలియదు కష్టపడి పైకి వచ్చాడు అని తెలియచేశారు ఆయన.