బాలయ్య బాబు సినిమాలో ఆ హీరోయిన్ కు ఛాన్స్ ? టాలీవుడ్ టాక్

బాలయ్య బాబు సినిమాలో ఆ హీరోయిన్ కు ఛాన్స్ ? టాలీవుడ్ టాక్

0
105

బాలయ్య బాబు వరుస పెట్టి సినిమాలు ఒకే చేస్తున్నారు.. ప్రస్తుతం అఖండ చేస్తున్నారు బాలయ్య ఈ సినిమా తర్వాత మరో రెండు స్టోరీలు ఇప్పటికే ఒకే చేశారు.. అయితే దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.. ఇక ఆయన పుట్టిన రోజున దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.. తాజాగా క్రాక్ సినిమాతో మంచి విజయం సాధించారు దర్శకుడు గోపిచంద్ మలినేని.. అయితే బాలయ్యకు ఓ మంచి పవర్ ఫుల్ స్టోరీ వినిపించారట ఇటీవల.

 

 

ఇక ఈ స్టోరీ ఆయనకు నచ్చిందని ఇక అఖండ చిత్రం తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఈ సినిమా కథపై ఇప్పటికే గోపిచంద్ వర్క్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి..

అయితే ఇందులో ఇద్దరు భామలు నటించే అవకాశం ఉందట.

 

 

ఒకరు శ్రుతిహాసన్ అని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి… ఈ సినిమాలో ఒక పాత్రకి జోడీగా శ్రుతిహాసన్ ను అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.. మొత్తానికి టాలీవుడ్ టాక్ అయితే నడుస్తోంది.. దీనిపై ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.