బాలయ్య బాబు – కల్యాణ్ రామ్ సినిమా ఆ దర్శకుడు ఫోకస్ ?

బాలయ్య బాబు - కల్యాణ్ రామ్ సినిమా ఆ దర్శకుడు ఫోకస్ ?

0
98

బాలయ్య బాబు అభిమానులు అందరూ ఇప్పుడు అఖండ సినిమా గురించి చూస్తున్నారు.. ఈ సినిమాలో బాలయ్య బాబు లుక్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు… ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ కూడా ఇచ్చారు, అయితే కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఏమవుతుందా అని చూస్తున్నారు, అయితే ఈ సినిమా తర్వాత బాలయ్యబాబు ఏ కథ చేస్తారా అని కూడా ఎదరుచూస్తున్నారు అభిమానులు.

 

ఈ సినిమా తరువాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.క్రాక్ సినిమా చూసిన బాలకృష్ణ ఆయన చెప్పిన కథ నచ్చి ఒకే చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఈ సినిమా తర్వాత ఆయన మరో సినిమాని ఒకే చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారట.. టాలీవుడ్ వార్తల ప్రకారం చూస్తే ఎఫ్ 3 పూర్తయిన తరువాత బాలకృష్ణ ప్రాజెక్టుపైనే అనిల్ రావిపూడి ఫోకస్ చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు, మరి ఈ వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.