ఓటీటీలో బాలయ్య ‘అఖండ’ రికార్డ్..24 గంటల్లోనే 1 మిలియన్ స్ట్రీమింగ్స్

Balayya 'Akhanda' record in OTT..1 million streams in 24 hours

0
112

సింహా’, ‘లెజెండ్’​ తర్వాత బోయపాటి- బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్​ సినిమా ‘అఖండ’. డిసెంబర్​ 2న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. విదేశాల్లోనూ అఖండ అదరగొట్టింది. బాలయ్య కెరీర్ లో అఖండ చిత్రం అత్యధిక వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రంలోని అఖండ టైటిల్ సాంగ్, జై బాలయ్య వీడియో సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రల్లో కనిపించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. తాజాగా బాలయ్య నటించిన ‘ అఖండ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డిస్నీ హాట్ స్టార్ వేదికపై ఇటీవలే రిలీజ్ అయింది. ఇక అభిమానులు పండగ చేసుకుంటున్నారు. విడుదలైన 24 గంటల్లోనే.. 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించింది. ఓటీటీ వేదికపై కూడా అఖండ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఈ రేంజ్ లో ప్రేక్షకులు అఖండను అదరిస్తుండటంతో బాలయ్య ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అఖండ నిలిచింది.

మరోవైపు బాలయ్య గోపిచంద్ మలినేనితో, అనిల్ రావిపూడితో సినిమాలు చేయాల్సి ఉంది. అలాగే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ అన్స్టాపబుల్’ టాక్ షో కూడా పెద్ద హిట్ అయింది. ఇప్పటికే ఈ షోకు రాజమౌళి, శ్రీకాంత్, రవితేజ, రానా, మంచు కుటుంబం రాగ త్వరలో మహేష్ బాబు ఎపిసోడ్ త్వరలో టెలికాస్ట్ కానుంది.