బాలయ్య ఫ్యాన్స్ ఇప్పుడు బోయపాటి సినిమా కోసం చూస్తున్నారు.. బోయపాటి సింహ లెజెండ్ చిత్రాలు సక్సెస్ అయ్యాయి బాలయ్యకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.. అందుకే బోయపాటి ఈ సినిమా ఎలా తీయబోతున్నారా అనే ఆతృత అభిమానుల్లో ఉంది. ఈ సినిమా నుంచి ఓ లుక్ అయినా వస్తుందా అని చూస్తున్నారు.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా, ఈ నెల 15వ తేదీన రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నాయికగా శ్రియను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే బాలయ్య సినిమా అంటే ఇద్దరు ముగ్గురు కథానాయికలు ఉంటారు అనేది తెలిసిందే.. ఈ చిత్రంలో కూడా మరో నటికి అవకాశం ఉందట.
అందుకే ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కోసం నయనతారని తీసుకుంటున్నారు అని తెలుస్తోంది..కథలో బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నయనతార కనిపిస్తుందని చెబుతున్నారు. గతంలో ఇద్దరితో కలిసి బాలయ్య నటించారు.. సో ఇప్పుడు కూడా మళ్లీ ఇదే రీపిట్ చేయనున్నారట బాలయ్య.