రూలర్ సినిమా తరువాత కాస్త బ్రేక్ తీసుకున్నారు బాలయ్య, అయితే తన ఫేవరెట్ దర్శకుడు బోయపాటితో కలిసి ఆయన సినిమా చేసేందుకు సిద్దం అయ్యారు, అయితే ఈ సినిమాలో చాలా కొత్త క్యారెక్టర్లు ఉంటాయి అని తెలుస్తోంది.. ఇప్పటికే కమెడియన్ సునీల్ బాలయ్య పక్కన ఉండే కీలక రోల్ చేస్తున్నారట, ఇప్పటికే ఆయనకు సంబంధించి కాల్షీట్లు కూడా తీసుకున్నారు.
అయితే బాలయ్య సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కూడా అదే రేంజ్ లో ఉండాలి.. అయితే లెజెండ్ సినిమా ద్వారా విలన్గా పరిచయమైన జగపతి బాబు విలన్ పాత్రలో మంచి మార్కులే కొట్టేయడం కాకుండా, బాలయ్య పౌరుషానికి ఏ మాత్రం తీసిపోకుండా డైలాగ్లు చెప్పాడు. తాజాగా చేస్తున్న సినిమాలో మాత్రం బాలయ్య పక్కన మరో కొత్త విలన్ని పరిచయం చేయాలని బోయపాటి భావిస్తున్నారట.
అందుకే బాలయ్య సినిమాలో ముందు హీరో రాజశేఖర్ ని విలన్ గా అనుకున్నారు కాని ఇది కుదరలేదు, తాజాగా ఇందులో ఓ నార్త్ ఇండియన్ ని విలన్ పాత్రలో తీసుకుంటున్నారట. మరో పక్క సునీల్ కి కూడా డిస్కోరాజాతో మంచి పేరు వచ్చింది ఆయన ఈ సినిమాలో ఏ పాత్ర చేస్తారా అని చూస్తున్నారు అభిమానులు.