బాలయ్య సినిమాకి సంగీత దర్శకుడు ఫిక్స్

బాలయ్య సినిమాకి సంగీత దర్శకుడు ఫిక్స్

0
88

బాలయ్య బాబు సినిమా కోసం అభిమానులు ఎలా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, బాలయ్య బాబు సినిమాకు ఆ మాత్రం బజ్ ఉంటుంది అనేది తెలిసిందే, అంతేకాదు సినిమా రిలీజ్ చేసే సమయంలో కావాల్సినంత బజ్ ముందే వస్తుంది. బాల‌కృష్ణ‌, బోయపాటి కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే, ఈ సినిమాకి బాలీవుడ్ సీనియర్ నటుడ్ని విలన్ గా చూస్తున్నారు, మరి ప్రతికథానాయకుడు కూడా బోయపాటి సినిమాలో విలక్షణ నటుడిగా ఉంటారు అనేది గత సినిమాలు చూస్తే తెలుస్తుంది. సో అందుకే బాలీవుడ్ వరకూ వీరి క్రూజ్ ప్లాన్స్ వెళ్లాయి.

ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి బాణీలు ఇచ్చేందుకు గాను త‌మిళ యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా బోయపాటి తీసుకుంటున్నాడ‌ని టాక్‌, ఇక అనిరుద్ పాటలు ఆయన బాణీలు మనకు తెలిసిందే .. సంగీత అభిమానులను ఉర్రూతలూగిస్తాడు మన అనిరుద్. అందుకే బాలయ్య సినిమాకి అనిరుద్ ని ఫిక్స్ చేశారట .. ఇప్పటికే తమన్ దేవీశ్రీతో చేసిన బోయపాటి అనిరుద్ తో ట్రావెల్ చేయాలి అని భావిస్తున్నారట..సింహా–లెజెండ్ తర్వాత అదే హైప్ లో సినిమా తీసుకువస్తున్నాడు మన బోయపాటి.