1980 స్టార్స్ 10వ యానివర్శరీ పార్టీకి బాలయ్య అందుకే రాలేదట

1980 స్టార్స్ 10వ యానివర్శరీ పార్టీకి బాలయ్య అందుకే రాలేదట

0
101

1980లో నటించిన అగ్ర తారలు అందరూ కలిసి ప్రతీ ఏడాది క్లాస్ ఆఫ్ ఎయిటీస్ అనే పార్టీ చేసుకుంటారు.. ప్రతీ ఏడాది ఒక్కో వేదిక పంచుకుంటారు.. ఈసారి పదో వార్షికోత్సవ పార్టీ కావడంతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడమే గాక.. ఆయనే హోస్టింగ్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది..

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో ఈ పార్టీ నిర్వహించారు. ఈ రీయూనియన్ మీట్ లో ఈసారి 1980-1990లో అగ్ర తారలు పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ – కోలీవుడ్ సహా మలయాళం.. కన్నడం నుంచి మొత్తం 40 మంది తారలు ఈ వేడుకకు హాజరయ్యారు.

గత తొమ్మిదేళ్లుగా ఈ వేడుకలు విజయవంతంగా జరుగుతున్నాయి. పదో సారి కావడంతో ఘనంగా మెగాస్టార్ ఈ వేడుకల్ని స్వయంగా నిర్వహించారు. అయితే అందరూ వచ్చినా ఎప్పుడు వచ్చే బాలయ్య మాత్రం రాలేదు, ఆయన రూలర్ సినిమా షూటింగ్ కోసం వేరే ప్రాంతంలో ఉండటంతో ఆయన మిస్ అయ్యారు అని అంటున్నారు, మరో పక్క బాలయ్యకు సరైన ఆహ్వనం అందలేదు అని అందుకే రాలేదు అంటున్నారు మరి ఈ విషయం పై అనేక వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో.