నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ చిత్రం చేస్తున్నారు.. వీరి కాంబోలో ఇది మూడో చిత్రం… ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది… అయితే ఈ సినిమా టైటిల్ గురించి కూడా అనేక వార్తలు వినిపిస్తున్నాయి…తాజాగా బాలయ్య బాబు ఓ హిందీ సినిమాపై మనసుప్డడారు అని టాలీవుడ్ టాక్.
హిందీలో ప్రఖ్యాత నటుడు ఇర్ఫాన్ ఖాన్, రాధిక మదన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఇంగ్లీష్ మీడియం -ఆంగ్రేజీ మీడియం.. ఈ చిత్రం బాగా నచ్చిందట బాలయ్యకు..ఇది తెలుగులో చేయాలి అని ఆలోచన చేస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది.. అయితే దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు …వచ్చే వరకూ వెయిట్ చేయాల్సింటే అంటున్నారు అభిమానులు.
ఇక బాలయ్య బోయపాటి చిత్రానికి వస్తే ఈ సినిమాకి టైటిల్స్ అనేకం వినిపించాయి…గతంలో మోనార్క్, డేంజర్ అని ప్రచారంలో ఉన్నాయి.తాజాగా ఇప్పుడు గాడ్ ఫాదర్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది, మొత్తానికి దీనిపై ప్రకటన రావాల్సి ఉంది, మే 28న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.. ఇందులో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించనున్నారు.