బాలయ్య ఈ సినిమాతో రికార్డు క్రియేట్ చేస్తారట

బాలయ్య ఈ సినిమాతో రికార్డు క్రియేట్ చేస్తారట

0
90

టాలీవుడ్ లో బాలయ్య బాబు సినిమా అంటే ఓ రేంజ్ ఉంటుంది అనేది తెలిసింది.. అభిమానులు కూడా ఆయన సినిమాలపై ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు, ఎప్పుడు బాలయ్య సినిమా వస్తుందా అని ఎదురుచూస్తారు, ఇక తెలుగులో టాప్ హీరోల్లో మాస్ ఫాలోయింగ్ లో బాలయ్య బాబు హవా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బాలకృష్ణ నటిస్తోన్న 105వ చిత్రం రూలర్. ఈ సినిమాని కె.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేశారు, అలాగే నిర్మాతగా హ్యాపీ మూవీస్ బ్యానర్పై సి.కల్యాణ్ నిర్మించారు. డిసెంబర్ 20న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైజాగ్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడారు

నాన్నగారి బాటలో నడుస్తూ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించాను అని తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు బాలయ్య. ఆనాడు ఆదిత్య 369, శ్రీరామరాజ్యం, గౌతమిపుత్రశాకర్ణి, మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, సింహా, లెజెండ్ వంటి సినిమాలు సహా ఎన్నెన్నో పాత్రలను చేశాను అని చెప్పారు బాలయ్య.. తాను ఏ సినిమాలు చేసినా ఏ పాత్ర పోషించినా మీ అభిమానులు అందరూ మెచ్చుకున్నారు అని . అన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారని ఆయన తెలిపారు. గతంలో మా కాంబినేషన్ లో జై సింహ వచ్చింది ఇప్పుడు రూలర్ వస్తోంది అని చెప్పారు బాలయ్య.