బండ్ల గణేశ్ కు క‌రోనా పాజిటీవ్ చికిత్స ఏ హాస్పిటల్ లో అంటే

బండ్ల గణేశ్ కు క‌రోనా పాజిటీవ్ చికిత్స ఏ హాస్పిటల్ లో అంటే

0
94

నిర్మాత న‌టుడు బండ్ల గ‌ణేష్ కు క‌రోనా సోకింది అని రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వార్త‌లు వ‌స్తున్నాయి, అయితే దీనిపై ఇది వాస్త‌వమా కాదా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు, ఈ స‌మ‌యంలో దీనిపై ఆయ‌న క్లారిటీ ఇచ్చారు.

త‌న‌కు వైర‌స్ సోకింది అని తెలిపారు..అపోలో లేదా కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరనున్నానని, ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని ఆయన తెలిపార‌ట‌, అయితే ఆయ‌న ఫార‌మ్ బిజినెస్ లో ప‌లువురు వ్యాపారుల‌ని క‌లుస్తూ ఉంటారు.

ఈ స‌మ‌యంలో ఆయ‌న‌కు వైర‌స్ సోకి ఉంటుంది అంటున్నారు..ఇటీవల బండ్ల గణేశ్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ నిమిత్తం వెళ్లగా, అనారోగ్య లక్షణాలను చూసిన అక్కడి డాక్టర్ కరోనా టెస్ట్ కు రిఫర్ చేశారట. ఆ స‌మ‌యంలో టెస్ట్ చేస్తే పాజిటీవ్ అని తేలింది, దీంతో టాలీవుడ్ లో అంద‌రూ షాక్ అయ్యారు.