బండ్ల గణేశ్ కి పాజిటీవ్ రావడంతో ఫామ్ హౌజ్ కి వెళ్ళిపోయిన నాగ శౌర్య.

బండ్ల గణేశ్ కి పాజిటీవ్ రావడంతో ఫామ్ హౌజ్ కి వెళ్ళిపోయిన నాగ శౌర్య.

0
96

ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులువుగా వస్తోంది, అందుకే ఎవరికి అయినా వైరస్ సోకితే వెంటనే వారు ఆస్పత్రిలో చికిత్స కు వెళుతున్నారు, అంతేకాదు ఆ కుటుంబం మొత్తం క్వారంటైన్ కు వెళుతున్నారు, ఇక తాజాగా బండ్ల గణేష్ కు వైరస్ పాజిటీవ్ వచ్చింది, దీంతో ఆయన కుటుంబం కూడా టెస్ట్ చేయించుకున్నారు.

ఈ సమయంలో గణేష్ కు కరోనా పాజిటివ్ అన్న విషయం తెలియగానే సినీ ప్రముఖులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బండ్ల గణేశ్ ఉంటున్న ఇంటి పొరుగు ప్రాంతంలోనే హీరో నాగ శౌర్య ఉంటారు. ఇక బండ్ల గణేశ్ కు పాజిటివ్ రావడంతో నాగ శౌర్య తన కుటుంబాన్ని ఆ ప్రాంతంలో ఉంచడం సేఫ్ కాదని భావించి ఫామ్ హౌజ్ కి వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక ఆ ప్రాంతంలో వైరస్ ప్రభావం ఉంటుంది అని భావించి ఆయన షిప్ట్ అయినట్లు తెలుస్తోంది..
నాగశౌర్య ప్రస్తుతం సౌజన్య దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు .అయితే షూటింగులు అన్నీ ఆగిపోవంతో కొన్ని రోజులు అక్కడే ఉంటారు అని తెలుస్తోంది.