అనిల్ రావిపూడి చేసిన పనికి బండ్ల షాకింగ్ డెసిషన్

అనిల్ రావిపూడి చేసిన పనికి బండ్ల షాకింగ్ డెసిషన్

0
97

బండ్ల గణేష్ సినిమాల్లో ఓ రేంజ్ కు వెళ్లారు.. ఆయన సినిమా నిర్మాతగా మారి పవన్ కల్యాణ్ తో సినిమా చేయడం మెగా నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు.. అయితే తర్వాత రాజకీయాల్లో బిజీ అయిన ఆయన మళ్లీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు అయితే సినిమా నిర్మాణానికి కూడా కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు ఆయన.

అయితే నటించిన చాలా ఏళ్ల తరువాత మళ్లీ మొహానికి మేకప్ వేసి, కెమేరా ముందు నిల్చోపెట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బండ్ల గణేష్ కూడా తెగ ఉత్సాహ పడ్డాడు. చివరకు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో బండ్ల గణేష్ ఓ పాత్ర అయితే చేశారు, అయితే దీనిపై చిత్ర యూనిట్ కూడా ప్రచారం బాగా చేసింది.

ఇక మంచి స్టార్ అయిన ఆయన ఇక సినిమాలో కూడా అదరగొట్టే క్యారెక్టర్ చేసి ఉంటారు అని అందరూ అనుకున్నారు.. కాని సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుకున్నంత పాజిటీవ్ రెస్పాన్స్ అయితే ఈ పాత్రకు రాలేదు, ఈ పాత్ర బాగాలేదు అని కామెంట్లు వచ్చాయి.. దీంతో ఆయన డీలాపడ్డారు, ఇలా ఇలాంటి పాత్రలు చేయకూడదు అని ఫిక్స్ అయ్యారట, కేవలం మంచి కథ వస్తే నిర్మాతగానే చేస్తా కాని పాత్రలు చేయను అని డిసైడ్ అయ్యారట బండ్ల.