‘బంగార్రాజు’ టీజర్ రిలీజ్..అదరగొట్టిన సోగ్గాళ్లు!

'Bangarraju' teaser release..Adargottina Nagarjuna, Chaitanya

0
114

సోగ్గాడే చిన్ని నాయన’కు ప్రీక్వెల్​గా తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు. నాగార్జున-నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ, చైతూకు జోడీగా కృతిశెట్టి నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. తొలి పార్ట్​కు దర్శకత్వం వహించిన కల్యాణ్​కృష్ణ దీనిని తెరకెక్కించారు.

అన్నపూర్ణ స్టూడియోస్​ బ్యానర్​లో నాగార్జునే స్వయంగా నిర్మించారు.సంక్రాంతే లక్ష్యం  ఈ సినిమా బరిలోకి దిగుతుంది. దీనితో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. అందులో భాగంగా న్యూ ఇయర్​ సందర్భంగా శనివారం ‘బంగార్రాజు’ టీజర్ రిలీజ్ చేశారు.

https://www.youtube.com/watch?v=LaIB9_PcvQU&feature=emb_title

టీజర్ చూస్తుంటే మరోసారి సోగ్గాడే చిన్నినాయన సినిమా చూస్తున్నట్లే అనిపిస్తుంది. టీజర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇందులో చైతూ, నాగార్జున సమానంగా కనిపిస్తున్నారు. కుర్ర బంగార్రాజు పాత్రలో చైతూ నటిస్తున్నాడు. సీనియర్ రైటర్ సత్యానంద్ ఈ సినిమాకు రచనా సహకారం అందించారు. తొలి భాగంలో బంగార్రాజు పై లోకం నుంచి కిందకి వచ్చి యముడి పిలుపుతో మళ్లీ పైకి వెళ్లిపోతాడు. అయితే రెండో భాగంలో స్వర్గం నుంచి మళ్లీ భూమి మీదకు వచ్చి.. తన జీవితంలో ఏం జరిగింది.. అసలు తనను ఎందుకు చంపారు అనేది కథ. తొలి భాగం ముగిసిన దగ్గర్నుంచి వెనక్కి వెళ్తుంది కథ.