హీరో కార్తికేయతో బన్నీ వాసు కొత్త ప్రయోగం

హీరో కార్తికేయతో బన్నీ వాసు కొత్త ప్రయోగం

0
99

భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్2 బ్యానర్ సక్సెస్ మంత్రంగా ముందుకు సాగుతోంది. ఈ బ్యానర్ చిన్న చిత్రాలకు లైఫ్ ఇస్తోంది, తాజాగా ఆర్.ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం చావు కబురు చల్లగా ఈ సినిమాపై కార్తికేయ ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు

ఈ సినిమాతో దర్శకుడిగా కౌశిక్ పెగళ్లపాటి పరిచయం కానున్నారు. 2020లో సెట్స్ పైకి వెళ్లనుంది ఈ చిత్రం. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా చేయనున్నారు. దీంతో మరోసారి బిగ్ సినిమాకి గీతా ఆర్ట్ -2 ప్లాన్ చేసింది అనే చెప్పవచ్చు.

కార్తికేయ ఈ మూవీలో బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకుడు కౌశిక్ చెప్పిన పాయింట్ నచ్చి నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను కార్తికేయతో చేయనున్నారు. ఇక ఈ సినిమా పై గత నెల రోజుల నుంచి సిటింగ్స్ జరుగుతున్నాయి.. తాజాగా కార్తికేయ ఈ సినిమాకి ఒకే చెప్పారు. పూర్తి విభిన్న కథతో సినిమా తెరకెక్కించనున్నారు చిత్ర టీం, క్రూ త్వరలో తెలియనుంది.