భారీగా రేటు పెంచేసిన పూజా హెగ్దే….

భారీగా రేటు పెంచేసిన పూజా హెగ్దే....

0
78

టాలీవుడ్ లో సమంత, కాజల్ అగర్వాల్, రకుల్, మిల్కీ బ్యూటీ తమన్న లాంటివారు… సీనియర్స్ అయ్యి స్టార్ హీరోలకు సైడ్ అయిపోగా ప్రస్తుతం టాప్ వన్ లో పైజా హెగ్దే అదరగొట్టేస్తుంది… స్టార్ హీరోల ఏకైక ఛాయిస్ పూజా హెగ్దే తప్ప మరెవ్వరు కనిపించడంలేదు…

వరుస హిట్స్ తో పిచ్చెక్కిస్తున్న హెగ్దే ఇప్పుడు సినిమాకు వచ్చే కోటిన్నర నుంచి రెండుకోట్లు డిమాండ్ చేసి మరీ తీసుకువెళ్తోందట… డిమాండ్ ఉంది క్రేజ్ ఉంది కాబట్టి పారితోషకం భారీగా పట్టుకెళ్తుంది.. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు వ్యవహారం బాలీవుడ్ లో యమారంజుగా ఉంది… అమ్మడుకి బాలీవుడ్ వరుస ఆఫర్లు తగులుతున్నాయి…

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో రెండు బాలీవుడ్ లో మరో నాలుగు సినిమాల ఆఫర్స్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది… కాగ గతంలో బాలీవుడ్ మెట్లు ఎక్కి తిరిగి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అక్కడ పాగ వెయడమే కాదు టాలీవుడ్ లో రెండు కోట్లు బాలీవుడ్ లో నాలుగు కోట్లు డిమాండ్ చేస్తుందట…