భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేసిన సిద్ శ్రీరామ్ పాట‌కి ఎంతంటే ?

భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేసిన సిద్ శ్రీరామ్ పాట‌కి ఎంతంటే ?

0
98

టాలీవుడ్ లో ఏ సాంగ్ వింటున్నా అరే ఈ సాంగ్ చాలా బాగుంది ఎవరు పాడారురా బాబు… ఇంత బాగా పాడారు అని చాలా మంది అనుకుంటున్నారు… అయితే తాజాగా వస్తున్న అన్నీ పాటల్లో కచ్చితంగా ఆ యువ గాయకుడు గాత్రం ఉంటోంది.. అతనే సిద్ శ్రీరామ్.. టాప్ సినిమాలు అన్నీ ఆయన పాటలతో దూసుకుపోతున్నాయి..
ఉండిపోరాదే
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
సామజ వర గమన
నీలి నీలి ఆకాశం ఇలాంటి పాటలు ఆయన స్థాయిని పెంచుతూ వచ్చాయి…. నిజంగా అతని గాత్రంలో ఏదో మాజిక్ ఉంది అంటున్నారు పాటల ప్రియులు. ఇక యూత్ లో చాలా మంది అతనికి ఫ్యాన్స్ అనే చెప్పాలి. ఇక ఏదైనా కొత్త సినిమా వస్తోంది అంటే శ్రీరామ్ తో పాట పాడిద్దాం అనేలా అతని మార్కెట్ పెరిగింది.

దీంతో ఆయన తన పారితోషికాన్ని పెంచారు అని తెలుస్తోంది. ఒక్కో పాటకి ఆయన 5 లక్షలను తీసుకుంటున్నట్టుగా చెబుతున్నారు. సాధారణంగా సింగర్స్ పారితోషికాన్ని డిమాండ్ చేసిన సందర్భాలు తక్కువ. కాని ఆయన డిమాండ్ కు తగ్గట్లు తీసుకుంటున్నారు అని అంటున్నారు అభిమానులు.