భారీ ఆఫర్ వద్దన్న అనసూయ ఎందుకంటే

భారీ ఆఫర్ వద్దన్న అనసూయ ఎందుకంటే

0
100

జబర్ధస్త్ అంటే ప్రత్యేకమైన అభిమానం అందరికి.. వారానికి రెండు రోజుల పాటు అల్టిమేట్ కామెడీ అందిస్తుంది ఈ షో, ఇక ప్రత్యేకంగా స్కిట్ల గురించి చెప్పుకోవక్కర్లేదు, ఇక ఇందులో యాంకర్ రష్మి, అనసూయకు మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇక అనసూయ ఇక్కడ నుంచి సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించింది.రంగమ్మత్తగా రంగస్ధలం సినిమాలో ఎంత మంచి పేరు వచ్చిందో తెలిసిందే, ఇక ప్రధాన చిత్రాల్లో ఇప్పుడు ఆమె నటిస్తోంది, పలు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

ఇక తాజాగా ఆమె ఓ భారీ ఆఫర్ వద్దు అని చెప్పిందట, ఆమెకి తెలుగు బిగ్ బాస్ 4 నుంచి ఆహ్వనం వచ్చింది అని తెలుస్తోంది, ఆమెని బిగ్ బాస్ ప్రతినిధులు సంప్రదించారట..గత సీజన్లో యాంకర్ శ్రీముఖిని ఎంపిక చేసుకున్న నిర్వాహకులు, ఈ సారి అనసూయని సంప్రదించారట,కాని ఆమె నో చెప్పింది అని తెలుస్తోంది.

సినిమాలు షోలతో ఆమె చాలా బిజీగా ఉంది, పైగా ఫ్యామిలీని తాను అన్నీ రోజులు విడిచి దూరంగా ఉండలేను అని చెప్పిందట. భారీ ఆఫర్ ఇచ్చినా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది.